తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యూట్యూబ్​లో 'డియర్​ కామ్రేడ్​' మరో రికార్డు - విజయ్​, రష్మిక

విజయ్​ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'డియర్​ కామ్రేడ్​'. తెలుగులో ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయినా, యూట్యూబ్​లో విడుదల చేసిన హిందీ వెర్షన్​లో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది.

dear comrade makers have released the Hindi dubbed version of the film on YouTube and the video made the fastest 1 million likes
యూట్యూబ్​లో 'డియర్​ కామ్రేడ్​' మరో రికార్డు

By

Published : Feb 6, 2020, 8:54 PM IST

Updated : Feb 29, 2020, 10:57 AM IST

హీరోహీరోయిన్లు విజయ్​ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్​'. దక్షిణాదిలోని నాలుగు భాషల్లో, గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆశించిన ఆదరణ దక్కించుకోలేకపోయింది. అయితే ఇటీవలే వచ్చిన యూట్యూబ్​లోని హిందీ వెర్షన్​ మాత్రం ఓ రికార్డు సృష్టించింది.

యూట్యూబ్​లో 'డియర్​ కామ్రేడ్​' మరో రికార్డు

యూట్యూబ్​లో విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వీక్షణలు సొంతం చేసుకున్న ఈ సినిమా.. తక్కువ సమయంలో అత్యధిక లైకులు సాధించిన తెలుగు డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. ఓ రోజులోనే 1 మిలియన్‌ లైకులు సొంతం చేసుకుంది. లైకులు మాత్రమే కాదు విజయ్, రష్మిక నటనకు ఫిదా అయి, తమ అభిమానాన్ని కామెంట్స్‌ రూపంలో వెల్లడిస్తున్నారు నెటిజన్లు.

త్వరలోనే బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని వెండితెరపై పలకరించబోతున్నాడు విజయ్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్న తన కొత్త చిత్రంతో దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాది ప్రేక్షకులను అలరించనున్నాడు.

ఇదీ చదవండి: విజయ్​ ఇకపై ప్రేమకథల్లో నటించడు!

Last Updated : Feb 29, 2020, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details