బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌కు మాస్ హీరోగా పేరుంది. తన చిత్రాల్లో విచిత్ర విన్యాసాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. తొలిచిత్రం "ఫూల్ ఔర్ కాంటే"లో రెండు బైక్‌లపై కాళ్లు పెట్టి చేసిన స్టంట్ బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆయన తాజా చిత్రం "దే దే ప్యార్ దే" తొలిరూపు విడుదలైంది. ఈ సినిమా పోస్టర్లో రెండు కార్లపై కాళ్లు పెట్టి అజయ్ చేసిన విన్యాసం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. దీనిపై అజయ్ ట్విట్టర్లో స్పందించాడు. ఇంటి దగ్గర ప్రయత్నించొద్దని సూచించాడు.
'ఈ విన్యాసాన్ని ఇంటి దగ్గర ప్రయత్నించొద్దు' - టబు
అజయ్ దేవ్‌గణ్ తాజా చిత్రం దే దే ప్యార్ దే తొలిరూపు విడుదలైంది. రెండు కార్లపై రెండు కాళ్లను పెట్టి అజయ్ చేసిన స్టంట్ అభిమానుల్ని అలరిస్తోంది.
1991లో వచ్చిన తొలిచిత్రం నుంచి వీలు చిక్కినప్పుడల్లా వాహనాలపై అజయ్ ఈ విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు. ఫూల్ ఔర్ కాంటే, గోల్మాల్ సిరీస్ చిత్రాల్లో ఈ స్టంట్స్ చేశాడు. సన్ ఆఫ్ సర్దార్ సినిమాలో అయితే రెండు గుర్రాలపై వస్తూ అభిమానుల్ని పిచ్చెక్కించాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నాడు.
" దే దే ప్యార్ దే" చిత్రంలో అజయ్ సరసన టబూ, రకుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అకీవ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ రంజన్ కథ సమకూర్చగా భూషణ్ కూమార్ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.