'దిల్వాలే దుల్హానియా లేజాయేంగే'.. బాలీవుడ్ ప్రేమకథల్లో క్లాసిక్ ముద్రను సొంతం చేసుకున్న సినిమా. షారుఖ్, కాజోల్ జంటగా నటించిన ఈ చిత్రం.. నేటితో పాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో మహిళా ప్రేక్షకులకు షారుఖ్.. ఎంతో దగ్గరయ్యాడు. రొమాంటిక్ చిత్రాల్లో నటించాలంటే.. తన తర్వాతే ఎవరైనా అనే పేరు దక్కించుకున్నాడు. కానీ, తాను రొమాంటిక్ పాత్రల్లో నటించడానికి ఎప్పటికీ సరిపోనేమో అని అంటున్నాడు షారుఖ్.
"అప్పటి కథానాయకులతో పోల్చుకుంటే నేను చాలా అసహజంగా ఉన్నానని అనిపించేది. అందరితో నేను ఈ విషయాన్ని చెప్పేవాడిని. అందంగా లేకపోవడం వల్ల అలా అనిపించేదేమో! అలాగే అందరూ నన్ను చాకోలెటీ అని పిలిచేవారు. దానివల్ల.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి నేను సరిపోనేమో అనుకునేవాడిని. లేడీస్‌తో వ్యవహరించడంలోనూ నేను కాస్త మొహమాటస్తుడిని. నాకైతే తెలియదు. నేను కాజోల్‌తో కలిసి ఆ ప్రేమ సన్నివేశాల్లో ఎలా నటించగలిగానో!"