ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న 'ద బ్యాట్మాన్' సినిమా విడుదలను వాయిదా వేసినట్టు ఆ సంస్థ తెలిపింది. కరోనా కారణంగా మార్చిలో చిత్రీకరణను నిలిపేసింది. ప్రణాళిక ప్రకారం వచ్చే ఏడాది జూన్ 25న రావాల్సి ఉండగా.. ఇప్పుడీ చిత్రాన్ని 2021,అక్టోబరు 1న రిలీజ్ చేస్తామని చిత్రబృందం తాజాగా వెల్లడించింది.
దీంతో పాటు సూపర్ హీరో చిత్రాలైన 'ద ఫ్లాష్', 'షాజమ్2' విడుదలను వాయిదా వేశారు. అలాగే, "ద సోప్రానోస్" ఫీచర్ ప్రీక్వెల్ "ద మనీ సెయింట్స్ ఆఫ్ నెవార్క్" తొలుత ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్నా.. వచ్చే ఏడాది మార్చి 12కు మార్చారు.
వార్నర్ స్టూడియోస్ ప్రకటించిన కొత్త విడుదల తేదీలు
వండర్ ఉమన్ 1984 : 2020 ఆగస్టు 14న విడుదల
ద బ్యాట్మాన్ : 2021 అక్టోబరు 1న విడుదల