'రొమాంటిక్ ఫేస్‌కట్ నాది కాదు.. అయినా ఉంటావా నాతో బంగారూ' అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్.. హీరోయిన్ నయనతార కోసం పాట పాడేస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం తెలియాలంటే 'దర్బార్' వచ్చే వరకు ఆగాల్సిందే. అందులోనిదే ఈ గీతం. శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన పాటలు అలరిస్తున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్.. నిఖార్సయిన బ్రహ్మాచారి! - #Rajinikanth
'దర్బార్'లోని 'నిఖార్సయిన బ్రహ్మాచారి'ని అంటూ సాగే గీతాన్ని చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్-నయనతార జోడీగా నటించారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్
ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు రజనీ. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. నివేదా థామస్ కీలక పాత్ర పోషించింది. అనిరుధ్ సంగీతమందించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'ఏరా నీకంత పొగరా' అని రజనీపై కోప్పడిన నిర్మాత!