తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీ 'దర్బార్' షూటింగ్ పూర్తి.. - darbar movie wrapped

రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న 'దర్బార్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా అసిస్టెంట్ డైరక్టర్లతో రజనీ దిగిన ఓ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది.

రజనీ

By

Published : Oct 4, 2019, 5:10 PM IST

సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ హీరోగా ఎ.ఆర్‌. మురుగ‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'దర్బార్'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సందర్భంగా సినిమా అసిస్టెంట్ డైరక్టర్లతో రజనీ దిగిన ఓ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది.

అసిస్టెంట్ డైరక్టర్లలతో రజనీ

ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు మ‌రో అవతారంలోనూ కనిపించబోతున్నాడట. ఆ పాత్ర ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. న‌య‌నతార హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ర‌జ‌నీ ఈ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. 'సైరా' బృందానికి అల్లు వారి గ్రాండ్ పార్టీ

ABOUT THE AUTHOR

...view details