సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమా 'దర్బార్'. గురువారం మోషన్ పోస్టర్ రానుంది. ప్రముఖ హీరోలైన కమల్‌హాసన్(తమిళం-తెలుగు), సల్మాన్‌ఖాన్(హిందీ), మోహన్‌లాల్(మలయాళం) తమ తమ భాషల్లో.. ఈ పోస్టర్‌ను సాయంత్రం 5:30కి విడుదల చేయనున్నారు.
'దర్బార్' మోషన్ పోస్టర్.. వారి చేతుల మీదుగా - rajanikanth latest news
స్టార్ హీరోలు సల్మాన్‌ఖాన్, మోహన్‌లాల్, కమల్‌హాసన్.. రజనీకాంత్ నటించిన 'దర్బార్' మోషన్ పోస్టర్‌ను రేపు(గురువారం) విడుదల చేయనున్నారు.
దర్బార్ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్
ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: అప్పుడు కమల్‌హాసన్.. ఇప్పుడు రజనీకాంత్