జేమ్స్ బాండ్ సిరీస్ నుంచి వస్తోన్న 25వ చిత్రం 'నో టైమ్ టు డై' విడుదల మరోసారి వాయిదా పడింది. 2021 ఏప్రిల్ 2 వరకు విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. 'ఆలస్యం మా అభిమానులకు నిరాశ కలిగించిందని మేము అర్థం చేసుకున్నాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా తప్పడం లేదు' అని మూవీ యూనిట్ పేర్కొంది.
ఈ చిత్రాన్ని తొలుత గతేడాది నవంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ముహూర్తం పెట్టినా, సాధ్యపడలేదు. అనంతరం ఏప్రిల్‌లో థియేటర్లలోనే బాండ్ అడుగుపెడతాడన్నారు. కానీ కరోనా దెబ్బతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో పరిస్థితులు కుదుటపడ్డాక నవంబర్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2021కి మళ్లీ వాయిదా వేశారు. దీంతో బాండ్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.