హాలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ క్రెయిగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. 'జేమ్స్‌బాండ్' సిరీస్‌లోని తన చివరి చిత్రం 'నో టైమ్ టూ డై' షూటింగ్లో ప్రతిష్టాత్మక 007 కారును అతడు నడిపేందుకు చిత్రబృందం అంగీకరించలేదు. ఈ విషయాన్ని క్రెయిగ్ స్వయంగా చెప్పాడు. అతడి వయసు దృష్ట్యా, భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారన్నాడు.
అత్యంగా వేగంగా ఛేజ్ చేసే ఓ సన్నివేశంలో కారును, హీరోకు బదులు స్టంట్డ్రైవర్ నడపాలని చిత్రయూనిట్ సూచించింది. ఈ విషయమై డేనియల్ అంగీకరించాడు.