'దబంగ్ 3' ప్రీరిలీజ్ ఈవెంట్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై తనకున్న ప్రేమను మాటల్లో చెప్పలేనని కథానాయకుడు రామ్ చరణ్ అన్నాడు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన 'దబంగ్ 3' ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా హాజరై ఇలా మాట్లాడాడు. ఇతడితో పాటే విక్టరీ వెంకటేశ్.. ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశాడు.
వేదికపై దబంగ్ 3 చిత్రబృందం "ఈ ఒక్క కార్యక్రమంలో, ఒక్క వేదికపై, కొన్ని మాటల్లో సల్మాన్ భాయ్‌పై నాకున్న ప్రేమను చెప్పలేను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. సల్మాన్, వెంకీ, సుదీప్, చిరంజీవి లాంటి సూపర్‌స్టార్స్ నుంచి నేను ఓ కామన్ విషయం నేర్చుకున్నా. అదే క్రమశిక్షణ.. నేటి మా తరం వీరి నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి" -రామ్‌చరణ్, హీరో
"దబంగ్ 3' హిందీలో కాకుండా తెలుగులోనూ వస్తోంది. చాలా సంతోషంగా ఉంది. తెలుగు ట్రైలర్ చాలా బాగుంది. సల్మాన్ పవర్ఫుల్ డైలాగ్‌లతో దుమ్మురేపాడు. మొత్తం చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్" -వెంకటేశ్, హీరో
హీరోలు సల్మాన్‌ఖాన్, వెంకటేశ్ "నమస్కార్.. హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది. మీరు మాకు ఘన స్వాగతం చెప్పారు. రామ్ మాకు మద్దతుగా ఉన్నాడు.. అతడు నా చిన్న తమ్ముడు. తను, చిరు గారు నాకు చాలా దగ్గరి వ్యక్తులు. గత 25 ఏళ్లుగా 'వెంకీ మామ'(నవ్వుతూ) నాకు తెలుసు. ఆయన నా క్లోజ్ ఫ్రెండ్. మీరు చూపుతున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు. అందరూ సినిమా చూడండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా" -సల్మాన్‌ఖాన్, 'దబంగ్ 3' హీరో
'దబంగ్ 3'కు ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతోందీ సినిమా. సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులో సమర్పిస్తోంది. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాటకు డ్యాన్స్ చేస్తున్న సల్మాన్-చరణ్-వెంకటేశ్