రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ - రామ్‌గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కె.ఎ పాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారని కె.ఎ.పాల్ చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.