చైనాలో కరోనా(కోవిడ్-19) ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి ప్రజలు ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ విషయంపై కొందరు ప్రముఖులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరో అమిర్‌ఖాన్ బాధితులకు ఓదార్పుగా నిలిచాడు. అందుకోసం సోషల్ మీడియాలో ఓ వీడియా సందేశాన్ని పంచుకున్నాడు.
"చైనాలో కరోనా సంక్షోభం నన్నెంతో కలచివేసింది. ఈ వైరస్ బారిన పడి చాలా మంది మరణించడం, నన్ను మరింత ఆందోళనకు గురిచేసింది. వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మిగిలినవారు దీని బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి"