తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షాహిద్​కపూర్​-విజయ్​సేతుపతి వెబ్​సిరీస్​పై ఫిర్యాదు! - విజయ్​ సేతుపతి వెబ్​సిరీస్​

బాలీవుడ్​ హీరో​ షాహిద్​ కపూర్​​, తమిళ స్టార్​ విజయ్​ సేతుపతి కలిసి నటిస్తున్న 'సన్నీ'(shahid kapoor vijay sethupathi movie) వెబ్​సిరీస్​ టీమ్​పై ఫిర్యాదు నమోదైంది! ఈ విషయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

shahid kapoor
షాహిద్​కపూర్​

By

Published : Oct 6, 2021, 7:22 AM IST

Updated : Oct 6, 2021, 12:11 PM IST

అది ముంబయి మహా నగరం, అక్కడ ఓ ప్రాంతంలోని రోడ్డు మీద రూ.2 వేల నోట్లు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ విషయం తెలిసిన కొద్ది సేపటికి చుట్టుపక్కల ఉండే వాళ్లంతా వాటిని ఏరుకోవడానికి ఎగబడ్డారు. తీరా వాటిని సరిగ్గా చూస్తే అవి నకిలీ నోట్లు, దీంతో వాళ్లంతా నిరాశతో వెనుదిరిగారు. కొందరేమో ఇలా గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేయడం నేరం అంటూ కేసు పెట్టారు. దీనంతటికీ కారణం షాహిద్ కపూర్(shahid kapoor raj and dk) నటిస్తున్న వెబ్ సిరీస్ 'సన్నీ'. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​ను తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్, డీకేలు(raj dk vijay sethupathi) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సిరీస్(vijay sethupathi raj and dk) చిత్రీకరణలో భాగంగా ఓ యాక్సిడెంట్ సన్నివేశం ఉంది. ఆ సమయంలో కరెన్సీ నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోతాయి. దీని కోసం నకిలీ నోట్లను ఉపయోగించారు. కానీ చిత్రీకరణ పూర్తయ్యాక వాటిని తీయడం మర్చిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. దీనిపై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"చిత్రీకరణ కోసం అనుమతి తీసుకున్నారు. గాంధీ మహాత్ముడికి అవమానం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నాం" అని పోలీస్ వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. "చిత్రీకరణ ముగిశాక అంతా శుభ్రం చేసింది మా బృందం. మరి ఆ నకిలీ నోట్లు ఎలా వచ్చాయో తెలియడం లేదు. ఇక గాంధీని అగౌరవ పరచాలనే ఆలోచన అయితే మాకు ఎంతమాత్రం లేదు" అని చిత్ర నిర్మాతలు చెప్పినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఇదిగో ఇలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఈ సిరీస్​లో విజయ్ సేతుపతి(Shahid kapoor Vijaysethupati), రాశీ ఖన్నా, రెజీనా నటిస్తున్నారు.

ఇదీ చూడండి: స్టైలిష్​గా కృతి సనన్​.. బికినీలో సోఫీ చౌదరి

Last Updated : Oct 6, 2021, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details