తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సబ్బుతో పోయే కరోనాకు మందు లేకపోవడం విచిత్రం' - గుండు సుదర్శన్ ఇంటర్వ్యూ

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ మంచి కమెడియన్​గా పేరు తెచ్చుకున్నారు గుండు సుదర్శన్. లాక్​డౌన్ తర్వాత బయటకొచ్చిన ఈయనను 'సితార' పలకరించగా పలు విషయాలు పంచుకున్నారు. మరి నవ్వుకునేందుకు మీరు సిద్ధమేనా..!

Comedian Gundu sudarshan interview
గుండు సుదర్శన్

By

Published : Jun 25, 2020, 5:51 PM IST

Updated : Jun 25, 2020, 7:01 PM IST

తనదైన హావభావాలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్న హాస్య నటుడు గుండు సుదర్శన్‌. సినిమాల్లో ఆయన గుండుపైనే ఎక్కువగా పంచ్‌లు పేలుతుంటాయి. ఆయనతో మాటలు కలిపినా అంతే. లాక్‌డౌన్‌ తర్వాత బయటికొచ్చిన గుండు సుదర్శన్‌ని 'సితార' పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఇంట్లో పడిన కష్టాల్ని సరదాగా బయట పెట్టారు. మరి మీరు నవ్వుకునేందుకు సిద్ధమేనా! అయితే పదండి.

'స్టే హోమ్‌.. స్టే సేఫ్‌' అన్నారు కదా, బాగా పాటించారా?

మనం ఇంట్లో ఉండటం (వరకే) మన 'చేతుల్లో'నూ.. మనం సేఫ్‌గా ఉండటం అనేది ఆవిడ 'చేతుల్లో'నూ ఉంటుంది. అర్థం చేసుకోరూ..!

బయటకెళ్లకుండా ఇంట్లోనే ఉండటం.. ఎప్పట్నుంచి మేనేజ్‌ చేశారు?

బయటికెళ్తే పోలీసులు మేన్‌ హాండిల్‌ చేస్తున్నారని తెలిసినప్పట్నుంచి!

మీకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉండదు కదా?

వర్క్‌ ఎట్‌ హోమ్‌లుంటాయిగా!

మరి ఈ పీరియడ్‌లో సంపాదన?

మూడు సోపులు.. ఆరు శానిటైజర్లు.. అంతా ఖర్చే! టెన్షనే!

గుండు సుదర్శన్

మీకు రిలీఫే లేదంటారా?

ఎందుకు లేదు? .. అపార్ట్‌మెంట్లలో మగాళ్లకి బారెడు జుట్లు పెరిగిపోయి, ఆది మానవుల్లా, అఘోరాల్లా అఘోరిస్తుంటే.. నేను హాయిగా తడుముకుంటూ కూర్చున్నా.. గుండు!

క్రియేటివ్‌గా కొత్త వంటకాలు ఏమైనా నేర్చుకున్నారా?

నేర్చుకోలేదు... నేర్చుకోవల్సి వచ్చింది. నా క్రియేటివిటీ గురించి, పరిస్థితి గురించి హింతకన్నా హేం చెప్పలేను.

కరోనాతో పోరాటంలో విరుగుడు మంత్రం మాస్కేనంటారా?

పోరాటం కరోనాతోనైనా.. లైఫ్‌తోనైనా మాస్కే మార్గం... మాస్కే మంత్రం! మాస్క్‌ అనే పదంలో 'మూస్కో' అన్న సౌండింగ్‌ వినపట్టం లేదా?! (బై ది బై మీకు పెళ్లయిందా?)

కరోనా విషయంలో మీ కామెంట్‌?

సబ్బుతో చచ్చే (పోయే) వైరస్‌కి.. దాన్ని చంపే మందు లేకపోవడం విచిత్రం!

ఇంట్లోకో, వంటకో ఏవో కొనుక్కోవటానికి బయట ఏ సూపర్‌ మార్కెట్‌కో వెళ్లి ఉంటారుగా.. కాస్త రిలీఫ్‌ అనిపించిందా?

రిలీఫ్‌ సంగతి సరే... నా పరిస్థితి మాత్రం మీకు మాంచి కామెడీగా ఉన్నట్టుంది. రిలీఫే కదండీ.. బెయిలు మీద బయటకొచ్చినవాడిలా! రోడ్డంతా ఎక్కడ చూసినా సున్నాలే.. సోషల్‌ డిస్టెన్సింగ్‌ సున్నాలు. చదువుకునే రోజుల్లోని నా ప్రోగ్రెస్‌ రిపోర్టుని రోడ్డంతా పరిచినట్టనిపించింది!

షూటింగ్‌లు మొదలయ్యాయంటగా... వెళ్లారా... ఏంటి మీ ఫీలింగ్‌?

వెళ్లా... ఇంట్లో ఉన్నట్టే ఉంది. హోమ్లీగా...! (కుకింగ్‌ వాసనలు వదలట్లే... ఇంటి నుంచి మాటిమాటికీ ఫోన్లు... పోపులు, తాలింపులు ఎలా పెట్టాలో, ఉప్పులు, కారాలు ఎంతెంత వెయ్యాలో ఫోన్లో చెప్పాల్సి వస్తోంది.

Last Updated : Jun 25, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details