తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 4:50 PM IST

Updated : Jun 9, 2020, 5:12 PM IST

ETV Bharat / sitara

ఏపీలో సినిమా షూటింగులకు జగన్​ అంగీకరించారు: చిరంజీవి

ఏపీలోని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిశారు. చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, రాజమౌళి, సి.కల్యాణ్‌, సురేశ్‌బాబు, దిల్ రాజు, నిర్మాత పొట్లూరి వరప్రసాద్​లు జగన్​తో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై చర్చించారు.

cm-jagan-meet-with-cinema-industry
15 తర్వాత.. షూటింగులకు ఏపీ సీఎం అంగీకారం: చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.

జులై 15వ తేదీ తర్వాత ఏపీలో షూటింగ్‌లు చేసుకునేందుకు సీఎం అంగీకరించారని చిరు తెలిపారు.

జగన్​తో భేటీ గురించి చిరంజీవి ఏమన్నారంటే...

  • తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులతో కలిసి ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నాం. ఇప్పుడు కరోనా కారణంగా కొద్ది మంది మాత్రమే వచ్చాం.
  • రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ రాణించడానికి వెసులుబాటును కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపాం.
  • లాక్‌డౌన్‌ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది. జూన్‌ 15 తర్వాత చిత్రీకరణలకు అనుమతి ఇచ్చారు.
  • ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని సమస్యలను ఏపీ సీఎం జగన్‌కు దృష్టికి తీసుకొచ్చేందుకు ఈరోజు ఆయన్ను కలిశాం. అన్నింటినీ సీఎం జగన్‌ సావధానంగా విని, సానుకూలంగా స్పందించారు.
  • సమస్యల పరిష్కారానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అందుకు సంబంధించిన విధివిధానాలను మంత్రి నాని, ఇతర అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు’.
  • లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతబడి పునః ప్రారంభం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ సమయంలో థియేటర్ల మినిమం పవర్‌ టారిఫ్‌లను రద్దు చేయాలని కోరాం. దానికి కూడా సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు.
  • ఇక గత కొంతకాలంగా నంది అవార్డులు ఆలస్యమవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని ప్రతి నటుడు, టెక్నీషియన్‌ కోరుకుంటాడు.
  • దీనికి కూడా 2019-20 సంబంధించిన అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ వేడుక కూడా ఈ ఏడాదే జరుగుతుందని ఆశిస్తున్నా.
  • అలాగే టికెటింగ్‌లో పారదర్శకత ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు’’
  • చెన్నై, బెంగళూరు, ముంబయి నగరాల్లో సినిమాను దాని బట్టి టికెట్‌ ధర పెరుగుతుంది. దీని వల్ల భారీ సినిమాలు తీసే నిర్మాతలకు మేలు జరుగుతుంది.
  • ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం వైఎస్‌ హయాంలో విశాఖలో 300 ఎకరాలను కేటాయించారు. దాన్ని పునః పరిశీలిస్తానని చెప్పారు.
  • ఏపీలో సినిమాలు నిర్మించాలి. అవుట్‌ డోర్‌ యూనిట్లు పెట్టాలనుకునేవాళ్లకు అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది.
  • సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలను విని, సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌కు చిత్ర పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Last Updated : Jun 9, 2020, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details