తమ చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న 80 నాటి అగ్రతారలంతా హైదరాబాద్‌లో ఒక్కచోట చేరి సందడి చేశారు. ఆ సందడికి మెగాస్టార్ చిరంజీవి నివాసం వేదికైంది. 1980-90 నాటి అగ్ర నటీనటులంతా ప్రతి ఏటా 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' పేరుతో వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈసారి పదో వార్షికోత్సవాన్ని జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఘనంగా జరుపుకొన్నారు.
మెగాస్టార్ ఇంట్లో రీ-యూనియన్ సందడి - చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్
80 నాటి అగ్రతారలంతా హైదరాబాద్‌లోని మెగాస్టార్ నివాసంలో సమావేశమయ్యారు.' క్లాస్ ఆఫ్ ఎయిటీస్' పేరుతో వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నారు.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా మలయాళం, కన్నడ నుంచి మొత్తం 40 మంది నటీనటులు హాజరయ్యారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మోహన్ లాల్, భానుచందర్, జగపతిబాబు, నరేష్, సురేష్, సుమన్, జయసుధ, జయప్రద, రాధిక, నదియా, అమల, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధా, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీష్రాప్, రెహమాన్, ప్రభు తదితర నటీనటులు తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాద్యమాల్లో పంచుకుంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
ఇవీ చూడండి.. ప్రేమికులకు సర్ప్రైజ్ ఇచ్చే ఆ ప్రేమికుడెవరో...?