తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెంకీ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా లేనట్లేనా! - విక్టరీ వెంకటేశ్ తాజా వార్తలు

విక్టరీ వెంకటేశ్​ 75వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.

Clarity on Venkatesh -Trivikram movie
'వెంకీ75' త్రివిక్రమ్​తో కాదు!

By

Published : Sep 8, 2020, 6:14 AM IST

ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్‌తో త్రివిక్రమ్ ఓ చిత్రం చేయబోతున్నారని వార్తలొచ్చాయి. గతంలోనే ఈ కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉండగా అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే మళ్లీ ఆ అంశం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం వెంకటేశ్‌ కథానాయకుడిగా 74వ చిత్రం 'నారప్ప'లో నటిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. తమిళంలో ఘన విజయం అందుకున్న 'అసురన్‌'కి రీమేక్ ఇది‌.

ఇదిలా ఉండగానే ‘వెంకీ 75’పై రూమర్లు టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తారంటూ ప్రచారం సాగింది. దీనిపై స్పష్టత ఇచ్చారు నిర్మాత నాగవంశీ. "మేము మీ ఆసక్తిని అర్థం చేసుకోగలం. త్రివిక్రమ్‌- వెంకీ కాంబినేషన్‌లో సినిమా అనే వార్తలు అవాస్తం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మించబోయే తదుపరి చిత్రాల సమచారాన్ని మా అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తాం" అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details