అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చినా ఇప్పట్లో థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఫలితంగా ఈ సినిమా ఓటీటీలో విడుదల అవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై చిత్రబృందం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వచ్చేది అప్పుడే! - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వార్తలు
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. కరోనా కారణంగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ పుకార్లేనని తెలుస్తోంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్లు షూటింగ్‌ను పూర్తి చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత.