'దిశ' అత్యాచారం, హత్య కేసులో నిందితులు.. పోలీసు ఎన్కౌంటర్లో శుక్రవారం ఉదయం చనిపోయారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఘటనపై స్పందించారు.ఇది చాలా మంచి నిర్ణయమని పోలీసులకు అభినందలు చెప్పారు. ఇకపై ప్రతి ఒక్కరూ పోలీసు వ్యవస్థను చూసి భయపడాలని అన్నారు.
అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఆ నలుగురి మరణంతో 'దిశ' ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న 'దిశ' తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి, వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి.
-చిరంజీవి, సినీ నటుడు
తెలంగాణ పోలీసులకు సెల్యూట్. భయానికి సరైన సమాధానం దొరికింది. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం
-సమంత అక్కినేని, సినీ నటి
మరోసారి ఇలాంటి ఘటనకు పాల్పడే వారికి ఇది సరైన గుణపాఠంగా నిలవాలి. ఇప్పటినుంచైనా ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలి. ఆ భగవంతుడే పోలీసుల రూపంలో నిందితులకు సరైన శిక్ష విధించాడు. ఇకపై ఎవరైనా ఇలాంటి పని చేయాలంటే భయం రావాలి.
-నందమూరి బాలకృష్ణ, సినీ హీరో
ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..?? ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా.
-మంచు మనోజ్, సినీ హీరో
సినిమా టీజర్లు, ట్రైలర్లు ట్రెండింగ్ కాదు. ఈ ఎన్కౌంటర్ ట్రెండింగ్ అవ్వాలి. ఈ ఎన్కౌంటర్ను చాటింపు వేసి చెప్పాలి.