తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్​ఆర్​లో​ ఆ సీన్​ కోసం మూడేళ్లు కష్టపడ్డాం!' - ఆర్​ఆర్​ఆర్​ సినిమా తారక్​ ఇంట్రడక్షన్స్​ సీన్​

RRR movie Bridge blast scene: 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. భావోద్వేగభరితమైన ఈ సినిమాను తెరకెక్కించడం సవాల్‌తో కూడుకున్న విషయమని చెప్పారు. ఇంకా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులేంటో చూద్దాం..

RRR movie Bridge blast scene:
RRR movie entrance scene:

By

Published : Mar 29, 2022, 8:37 PM IST

Updated : Mar 29, 2022, 8:56 PM IST

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్

RRR movie Bridge blast scene: 'ఆర్​ఆర్​ఆర్'​లో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ పరిచయ సన్నివేశాలు తెరకెక్కించడానికి చాలా కష్టపడినట్లు తెలిపారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ స్టార్​ హీరోలిద్దరూ సినిమాలో తొలిసారి కలిసే సీన్​ను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఆ సీన్​ను తాము అనుకున్నట్లు రూపొందించడానికి దాదాపు మూడేళ్లు పట్టిందని పేర్కొన్నారు.

"బాహుబలి కోసం పని చేసిన వాళ్లు ఈ సీక్వెన్స్ కోసం పని చేశారు. హైదరాబాద్​లోనే దీన్ని చిత్రీకరించాం. అదో గొప్ప అనుభవం. ఇద్దరు సూపర్​ స్టార్​ కలిసేటప్పుడు ప్రేక్షకులకు గొప్ప అనుభూతి చెందాలని ప్రత్యేకంగా ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దాం. ఈ సీక్వెన్స్​ను తెరకెక్కించడానికి​ ఎక్కువ రోజులు తీసుకున్నాం. 2018లో మొదలు పెట్టాం. మా కావాల్సినట్టు అది రావడానికి చాలా కాలం పట్టింది. జనవరిలో సినిమా రిలీజ్​ అనుకున్నప్పుడు.. ఆ తేదీకి కొన్ని రోజులు ముందు పూర్తైంది." అని సెంథిల్​ అన్నారు.

హీరోల పరిచయ సన్నివేశాలను తీర్చిదిద్దడంపై మాట్లాడుతూ.. "ఇద్దరు హీరోల పరిచయ సన్నివేశాలు చాలా బాగున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. అయితే, ఎన్టీఆర్‌ పరిచయ సన్నివేశం కాస్త కష్టమైంది. ఎందుకంటే పులితో ఫైట్‌ అంటే ఎక్కడా గ్రాఫిక్స్‌ చేసిన ఫీలింగ్‌ రాకూడదు. అందుకే మా వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ మోహన్‌ సూచన మేరకు ప్రపంచంలోనే అత్యుత్తమ వీఎఫ్‌ఎక్స్‌ డిజైనింగ్‌ కంపెనీ ఎంపీసీకి ఆ బాధ్యతలు అప్పగించాం. ఒక జంతువును తెరపై చూపించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆ సన్నివేశం కోసం ఎన్టీఆర్‌ శ్రమనూ తక్కువ అంచనా వేయలేం. చెప్పుల్లేకుండా ఎన్టీఆర్‌ అడవుల్లో పరిగెత్తారు. అలాగే చరణ్‌ పరిచయ సన్నివేశం కూడా నాకు బాగా నచ్చింది. ఇందుకోసం స్టంట్‌ విజన్‌ చేయించాం" అని చెప్పారు.

దర్శకుడి విజన్‌, ఇద్దరు స్టార్‌ నటులను ఒకే ఫ్రేమ్‌లో చూపించడం తనకు పెద్ద సవాల్​గా అనిపించిందని సెంథిల్ అన్నారు. బాక్సాఫీసు రికార్డుల కంటే ప్రేక్షకులకు ఒక మంచి కథ చెప్పాలనేదే దర్శకుడు రాజమౌళి తాపత్రయమని పేర్కొన్నారు. అలాంటి దర్శకుడితో తన ప్రయాణం కొనసాగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: జక్కన్నపై ఆలియా అలక.. ఇన్​స్టాలో అన్​ఫాలో!

Last Updated : Mar 29, 2022, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details