తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రన్​వే 34' షూటింగ్ పూర్తి.. త్వరలో 'ధర్మస్థలి' విడుదల - దిశా పఠానీ న్యూస్

Cinema Updates: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో బాలీవుడ్ చిత్రం 'రన్​వే 34', 'యోధ', టాలీవుడ్ సినిమా 'ధర్మస్థలి' సంగతులు ఉన్నాయి.

cinema updates
సినిమా వార్తలు

By

Published : Dec 19, 2021, 8:26 AM IST

Cinema Updates: బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. అజయ్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం 'రన్‌వే 34' చిత్రీకరణ పూర్తైనట్లు శనివారం ప్రకటించారు. ఇందులో ఆయన పైలెట్‌గా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రన్​వే 34

యోధ..

Yodha Movie Sidharth Malhotra: ధర్మ ప్రొడక్షన్స్‌లో కరణ్‌జోహర్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం 'యోధ'. ఇటీవలే 'షేర్షా' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్‌ మల్హోత్ర కథానాయకుడు. నూతన దర్శక ద్వయం పుష్కర్‌ యోజ-సాగర్‌ అంబ్రీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నటించే కథానాయికల పేర్లను ప్రకటించారు. దిశా పటానీ, రాశి ఖన్నా ఇందులో సిద్ధార్థ్‌తో జోడీ కట్టనున్నారని తెలిపారు.

రాశి ఖన్నా, దిశా పఠానీ

ధర్మస్థలి..

Dharmasthali Shakalaka Shankar: షకలక శంకర్‌, పావని జంటగా రమణ మోగిలి తెరకెక్కించిన చిత్రం 'ధర్మస్థలి'. ఎం.ఆర్‌.రావు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. "శంకర్‌తో ఇలాంటి కథను ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. ప్రతిరోజూ మన జీవితాలతో ఆడుకుంటున్న ఓ అంశాన్నే ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. శంకర్‌ మార్క్‌ వినోదం కనిపిస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తుంది వినోద్‌ యాజమాన్య.

శకలక శంకర్

ఇదీ చదవండి:

రెండేళ్లు మిస్‌ అయ్యారు.. ఈసారి క్రిస్మస్‌ మనదే: నాని

Pushpa Movie Director: ఎర్రచందన నేపథ్యం.. 'పుష్ప' శక్తిమంతం

ABOUT THE AUTHOR

...view details