తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ కళాకారులకు చేయూతగా రజనీ, విజయ్​

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రణకై విధించిన లాక్​డౌన్​ కారణంగా.. సినీ పరిశ్రమపైనా ప్రభావం పడింది. ఫలితంగా వేలాది మంది కళాకారులకు పూట గడవడానికి ఇబ్బంది నెలకొంది. వీరికి చేయూతగా నిలిచేందుకు ప్రముఖ కథానాయకులు రజినీకాంత్​, విజయ్​ సేతుపతి ముందుకొచ్చారు.

cinema stars rajni kath and vijay sethupathi donated each rs.50 lacks to the FEFSI
సినీ కళాకారులకు చేయుతగా రజినీ, విజయ్​

By

Published : Mar 24, 2020, 4:52 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ కథానాయకులు రజనీకాంత్‌, విజయ్‌ సేతుపతి కళాకారులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ)కు ఒకొక్కరు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఇప్పటికే కొవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. చిత్రీకరణ అంటే వందల మందితో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కనీసం బియ్యం బస్తాలైనా కొనిస్తాం...

ఇప్పటికే దేశంలో మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఫలితంగా ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐకు చెందిన చిన్న స్థాయి కళాకారులు ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నారు. సంఘంలో 25,000 మంది కళాకారులు సభ్యులుగా ఉన్నారని, వారిలో 15,000 మంది కనీసం నిత్యావసర సరకులు కొనేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ఓ మీడియా సమావేశంలో తెలిపారు. సినీ ప్రముఖులు తమ వంతు సహాయం చేయాలని కోరారు. విరాళాలు ఇస్తే బియ్యం బస్తాలైనా కొని ఇస్తామని చెప్పారు. విషయం తెలుసుకున్న సినీ హీరో సూర్య, కార్తి, శివ కుమార్‌లు కలిసి రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. మంగళవారం రజనీ, విజయ్‌ దాతృత్వం చాటుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details