అక్కినేని శ్రీకర్ ప్రసాద్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. 'సైరా', 'సాహో' వంటి సినిమాలకు పనిచేసిన ఈయన.. తాజాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఆ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు.
"భారతీయులు చాలా వైవిధ్యం కలవారు. భాషలు ఎన్నో ఉండొచ్చు, కానీ భావోద్వేగాలు ఒకేలా ఉండంటం చాలా అదృష్టం" -శ్రీకర్ ప్రసాద్, సినీ ఎడిటర్
ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ట్వీట్
శ్రీకర్ ప్రసాద్.. 17 భారతీయ భాషల్లో ఎన్నో చిత్రాలకు ఫిల్మ్ ఎడిటర్‌గా పనిచేశారు. జాతీయ పురస్కారాలతో పాటు మరెన్నో ప్రశంసలు అందుకున్నారు. అలనాటి దర్శక నిర్మాత, నటుడు ఎల్వీ ప్రసాద్.. శ్రీకర్ ప్రసాద్‌కు దగ్గర బంధువు. గతేడాది వచ్చిన 'సైరా నరసింహారెడ్డి', 'సాహో' సినిమాలకు ఈయనే ఎడిటింగ్ చేశారు. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్', 'పొన్నియన్ సెల్వన్', 'భారతీయుడు 2' లాంటి పెద్ద చిత్రాలకు పనిచేస్తున్నారు.
ఇది చదవండి:బతికుండగానే ఆ హీరోయిన్‌కు శ్రద్దాంజలి ప్రకటించారు!