'బాహుబలి' సిరీస్‌తో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. 'స్టూడెంట్ నెం1' నుంచి 'బాహుబలి2' వరకు ఎందరో హీరోలకు విజయవంతమైన హిట్‌లను అందించాడు. ఈ రోజు అతడి పుట్టినరోజు సందర్భంగా, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.
'దర్శక ధీరుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే మీరు సినీ పరిశ్రమలో ఉన్న ఎందరో దర్శకులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా' -సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, హీరో
'పుట్టినరోజు శుభాకాంక్షలు ఎస్.ఎస్.రాజమౌళి. భారతీయ సినీ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్క్స్ సృష్టించాలని కోరుకుంటున్నాను' -రామ్‌చరణ్, హీరో
'తన సినిమాలతో విశ్వఖ్యాతి సాధించిన సినీ మాంత్రికుడు, భారత సినిమా గర్వించదగ్గ వ్యక్తి రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు నా సెల్యూట్' - కరణ్ జోహర్, దర్శక-నిర్మాత
'జన్మదిన శుభాకాంక్షలు రాజమౌళి సర్. ఈ ఏడాది మొత్తం అద్భుతాలను సృష్టించాలని, మరిన్ని గొప్ప విజయాలను సాధించాలని, కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను' - కాజల్ అగర్వాల్, హీరోయిన్