మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులు మొదలయ్యాయి. తాజాగా పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకతో పెళ్లి పనులు మరింత ఊపందుకోనుకున్నాయి. మరోవైపు బాలీవుడ్ నటి సన్నీ లియోనీ తన కుమార్తెతో కలిసి ఈత పోటీకి దిగింది. కథానాయిక ప్రగ్యా జైశ్వాల్ జిమ్‌లో కసరత్తులు చేస్తుంది. ఇక నటుడు నందు తన ఇంట్లో జరిగే సందడి వీడియోను 'కుర్‌కురే ఫ్యామిలీ' అంటూ అభిమానులతో షేర్ చేశారు.
వంటింట్లో నిత్యా.. ఈత కొలనులో సన్నీ..పెళ్లి పనుల్లో నిహారిక - ప్రియమణి
లాక్డౌన్ విరామ సమయంలో సినీప్రముఖులు ఇంటి వద్దనే ఉంటూ సోషల్మీడియా ద్వారా తమ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూల ద్వారా నెటిజన్లతో ముచ్చటిస్తున్నారు. వీటితోపాటు వారికి ఇష్టమైన వ్యాపకాలతోనూ సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా కొంతమంది సినీప్రముఖుల అప్డేట్లు ఏంటో తెలుసుకుందామా!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోగ్యంగా ఉండాలని ఆమె తల్లి ప్రత్యేక పూజలు చేయించారు. 'ఉరి' స్టార్ విక్కీ కౌశల్‌లో మరో కౌశలం కూడా ఉంది. వీణ వాయిస్తూ తనలోని ప్రతిభను బయటపెట్టారు. నిత్యామేనన్ ఈ మధ్య నటనలోనే కాదు.. వంట చేయడంలోనూ తనకు తానే సాటి అంటోంది. ఆమె షెఫ్ అవతారంలో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. సెట్‌లో ప్రియమణి ఫోన్ చూసుకుంటుంటే ఎవరో ఓటీపీ అడిగారు. ఆమె మాత్రం ససేమిరా అంటున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడాల్సిందే. ఇలా మన సెలబ్రిటీలు ఏయే ఆసక్తికర పోస్టులు పంచుకున్నారో మీరూ చూసేయండి..