ఇప్పటికే 'వెంకీమామ' చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సరికొత్త ప్రేమకథలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తోంది చిత్రబృందం. ఇందులో చైతూకు జోడీగా సాయిపల్లవి కనిపించనుంది.
వార్‌కు రెడీ అవుతోన్న చైతూ-రౌడీ..! - విజయ్ దేవరకొండ
నాగచైతన్యతో విజయ్ దేవరకొండ పోరుకు దిగబోతున్నాడా..? అంటే.. అవుననే అంటున్నాయి చిత్రసీమ వర్గాలు. వీరిద్దరూ ప్రేమికుల దినోత్సవ సీజన్లో బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నారట.
చైతూ సినిమా విడుదల రోజునే విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ బరిలో అడుగుపెట్టబోతున్నాడట. ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో నటిస్తున్నాడీ హీరో. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, క్యాథరీన్ థెరిసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవిధ్యభరిత ప్రేమకథాగా రూపొందుతోందీ చిత్రం. ఈ సినిమానూ ప్రేమికుల దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోందట. ఇదే నిజమైతే లవర్స్ డేకి ఈ యువ హీరోల సినిమాలు పోటీపడటం ఖాయం.
ఇదీ చూడండి : మజవరగమన'.. సరికొత్త రికార్డు