మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య' (వర్కింగ్ టైటిల్). ఇందులో మొదట హీరోయిన్గా ఎంపికైన త్రిష.. కొన్ని కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయంపై తాజాగా చిరంజీవి స్పందించాడు.
"త్రిష అలా ఎందుకు అందో.. ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకుందో నాకు అర్థం కాలేదు. నా కుమార్తె ఆమెకు సంబంధించిన దుస్తులను ఇప్పటికే పంపించింది. ఆమెను ఎవరైనా బాధించారా? అని మా బృందంలోని ప్రతి ఒక్కరిని అడిగాను. మణిరత్నం సినిమాలో అవకాశం రావటం వల్ల మా చిత్రం నుంచి తప్పుకున్నట్టు చివరకు తెలిసింది."