మెగాస్టార్ చిరంజీవి(chiru pranam khareedu) ఈ పేరు ఒక ప్రభంజనం. తెలుగు చిత్రసీమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఆయన.. తన కెరీర్‌లో ఎన్నో అద్భుత సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆయన డ్యాన్స్, ఫైట్స్ , యాక్షన్తో అభిమానులను మెప్పించారు. ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచిన చిరు నట ప్రస్థానం ప్రారంభమై నేటికి 43 ఏళ్లు పూర్తైంది. 1978లో 'ప్రాణం ఖరీదు'(pranam khareedu movie cast) సినిమా ఇదే రోజు విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు.
"ఆగస్టు 22 నేను పుట్టినరోజైతే సెప్టెంబరు 22 నటుడిగా నేను పుట్టినరోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు.నేను మరిచిపోలేనిరోజు. మీ అందరి ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది."
-మెగాస్టార్ చిరంజీవి.
కాగా, చిరంజీవి నటించిన తొలి సినిమా 'పునాది రాళ్లు'. అయితే దానికంటే, ముందు 'ప్రాణం ఖరీదు' చిత్రం రిలీజ్ అయింది.