తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Chiru 'Lucifer': చిరు సోదరిగా హిందీ హీరోయిన్! - chiranjeevi latest news

చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న 'లూసిఫర్' రీమేక్ సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ చిత్రంలో చిరు సోదరిగా బాలీవుడ్​ హీరోయిన్​ను తీసుకున్నారని టాక్. ఇంతకీ ఆమె ఎవరు?

chiranjeevi vidya balan lucifer remake
చిరంజీవి

By

Published : Jun 4, 2021, 8:54 PM IST

Updated : Jun 4, 2021, 9:17 PM IST

బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్న నటీమణి విద్యాబాలన్‌. ఆమె నటించే సినిమాలు, పాత్రలు విభిన్నంగా ఉంటాయి. అందుకే ఆమె ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. "సహజ సిద్ధంగా ఉన్న ఎలాంటి కథనైనా చేయడానికి నేను సిద్ధం" అని ఆమె గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆమె, మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లూసిఫర్‌' రీమేక్‌లో నటించనుందనే వార్తలు వస్తున్నాయి. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె చిరు సోదరిగా కనిపించనుందట. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరిపిందట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

విద్యాబాలన్

ఈ పాత్ర కోసం ఇప్పటికే పలువురు సీనియర్‌ నటీమణుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ పూర్తికాగానే ‘లూసిఫర్’ సెట్స్‌పైకి వెళ్లనుంది. నటుడు సత్యదేవ్‌ ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Last Updated : Jun 4, 2021, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details