మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా'కు సంబంధిచిన ఓ విషయం చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరు.. సినిమాలో నాలుగు పాటలున్నప్పటికీ రెండింటినే ఉంచబోతున్నామని చెప్పాడు. మిగతా వాటిని వీలును బట్టి ఉంచాలా లేదా అనే విషయం నిర్ణయిస్తామన్నాడు.
ఇంతకీ విషయం ఏమిటంటే 'సైరా'లో చిరు-తమన్నాలపై అదిరిపోయే డ్యూయోట్ను రూపొందించారట. కానీ సినిమా నిడివి 170 నిమిషాలు ఉండటం వల్ల ఈ గీతాన్ని తొలగించే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఒకవేళ ఇది నిజమైనా.. చిత్ర ఫలితం ఆధారంగా ఆ పాటను జత చేస్తారని సమాచారం.