మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ కోసం బిగ్‌బీ చేసిన భారీ సాయాన్ని చిరు ట్విట్టర్ వేదికగా కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం అమితాబ్ 12,000 కూపన్స్ విరాళంగా ఇచ్చారు. ఒక్కొక్క కూపన్ విలువ 1,500 రూపాయలు ఉంటుంది. వీటిని బిగ్ బజార్లో షాపింగ్ కొరకు ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తం కూపన్స్ విలువ 1.8 కోట్ల విలువ కావడం గమనార్హం. చిత్ర పరిశ్రమలన్నీ ఒక కుటుంబంగా భావించి అమితాబ్ ఈ సాయం చేశారని చిరంజీవి అన్నారు.
అమితాబ్ సాయానికి చిరంజీవి కృతజ్ఞతలు - కరోనా
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన పెద్ద మనసు చాటుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పేద సినీకార్మికులను ఆదుకునే ధ్యేయంతో వారికి రేషన్ కూపన్లను అందించనున్నట్లు గతంలో ప్రకటించారు. దానికి సంబంధించిన 12 వేల కూపన్లను తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఈ నేపథ్యంలో అమితాబ్‌కు ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.
రూ.1.8 కోట్ల విలువైన రేషన్కూపన్లు దానం చేసిన అమితాబ్
కరోనా లాక్డౌన్ కారణంగా సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ఇప్పటికే 'కరోనా క్రైసిస్ ఛారిటీ'(సీసీసీ) పేరుతో ఓ సహాయ నిధిని ఏర్పాటు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్స్, ప్రముఖులు ఈ ఛారిటీకి విరివిగా విరాళాలు ప్రకటించారు. ఇటీవలే తొలి విడతగా రేషన్, మందులను కొంతమందికి పంచినట్లు కమిటీ సభ్యుడు తమ్మారెడ్డి భరధ్వాజ తెలిపారు.
ఇదీ చూడండి.. ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది: శ్రద్ధ