విశాఖపట్నంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానికి మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi movies) అండగా నిలిచారు. ట్విట్టర్ ద్వారా మెగా అభిమాని వెంకటేశ్ తన అనారోగ్య సమస్యను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన చిరు(hero chiranjeevi movie).. విమాన టికెట్లు బుక్ చేయించి వెంకటేశ్ దంపతులను ఇంటికి ఆహ్వానించారు. సుమారు 45 నిమిషాల పాటు వారితో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు.
Chiranjeevi news: అభిమానికి మెగాస్టార్ చిరంజీవి భరోసా - chiranjeevi helped fan
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి హీరో చిరంజీవి(chiranjeevi family) భరోసా ఇచ్చారు. అతడికి అయ్యే మొత్తం వైద్య ఖర్చులను చెల్లిస్తానని మాట ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి
అలానే మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని(hyderabad news) ఒమేగా హాస్పిటల్స్‌లో పరీక్షల కోసం పంపించారు. అక్కడి వైద్యులతో స్వయంగా మాట్లాడి వెంకటేశ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్‌కు అయ్యే వైద్య ఖర్చులను మొత్తం తానే స్వయంగా భరిస్తానని మాటిచ్చారు. అవసరమైతే చెనైకి పంపించి వైద్యం చేయిస్తానని అభిమాని వెంకటేశ్‌కు చిరంజీవి భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 24, 2021, 1:04 PM IST