మెగాస్టార్.. మీరే మా స్ఫూర్తి, ధైర్యం - chiranjeevi birthday reactions
మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సహా ప్రముఖుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, నెటిజన్లు పెద్ద ఎత్తున విషెష్ చెబుతున్నారు.
చిరంజీవి
నర్తిస్తే నటరాజు కూడా మెచ్చుకుంటాడు. నటిస్తే ప్రతి తెలుగు వాడు పొంగిపోతాడు. కనిపిస్తే ప్రతి అభిమాని ఆరాధిస్తాడు. రఫ్ఫాడిస్తా అంటూ ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. నేడు(ఆగస్టు 22) ఆయన 66వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చిత్రసీమ ప్రముఖులు సహా అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. చిరు గురించి ఎవరు ఏమన్నారో ఓ సారి చూద్దాం..