తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరంజీవి 'భోళాశంకర్' నుంచి క్రేజీ అప్డేట్ - చిరంజీవి 'భోళాశంకర్' సినిమా

అగ్రకథానాయకుడు చిరంజీవి(megastar chiranjeevi movies) దూకుడు చూపిస్తున్నారు. సెట్​పై రెండు సినిమాలు ఉండగానే మరో సినిమా షూటింగ్​లోనూ పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న 'భోళా శంకర్'(bhola shankar movie chiranjeevi) నుంచి అప్డేట్ వచ్చింది.

chiranjeevi bhola shankar movie
చిరంజీవి 'భోళాశంకర్' మూవీ

By

Published : Oct 27, 2021, 9:59 AM IST

Updated : Oct 27, 2021, 10:07 AM IST

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాకు(bhola shankar movie 2021) ముహూర్తం ఖరారైంది. నవంబరు 11న ఉదయం 7:45 గంటలకు చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే నెల 15వ తేదీ నుంచి షూటింగ్​ మొదలుపెడతామని బుధవారం(అక్టోబరు 27) వెల్లడించారు.

చిరంజీవి 'భోళాశంకర్' అప్డేట్

తమిళ హిట్​ 'వేదాళం'(vedhalam telugu movie) రీమేక్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చిరుతో(chiranjeevi movies) పాటు ఆయన సోదరిగా కీర్తి సురేశ్​(keerthy suresh movies) నటిస్తోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. మెహర్​ రమేశ్(meher ramesh chiranjeevi) దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్​టైన్​మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మెహర్ రమేశ్-చిరు-మహతి స్వరసాగర్

ప్రస్తుతం 'ఆచార్య'తో(acharya movie release date) బిజీగా ఉన్న చిరంజీవి.. 'గాడ్​ఫాదర్' సినిమాలోనూ(godfather movie) నటిస్తున్నారు. 'లూసిఫర్' రీమేక్​గా దీనిని మోహన్​రాజా తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు చిరంజీవి. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 27, 2021, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details