Singer Bappilahiri died: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (69) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సంతాపం తెలిపారు. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్ చిరంజీవి, దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ సహా పలువురు ఉన్నారు. వీరందరూ బప్పితో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఎవరెవరు ఏమని ట్వీట్ చేశారో చూద్దాం..
"లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లహిరి ఆకస్మిక మరణం నన్ను ఎంతో కలచివేసింది. వ్యక్తిగతంగా ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నటించిన పలు సినిమాలకు ఆయన చార్ట్‌బస్టర్ హిట్స్ అందించారు. ఆయన అందించిన సంగీతంతో నా సినిమాలకు ప్రేక్షకుల్లో మరింత పాపులారిటీ దక్కింది. ఎన్నో పాటల రూపంలో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే"
- చిరంజీవి
"మరో అద్భుతమైన గాయకుడిని సినీపరిశ్రమ కోల్పోయింది. నాతో సహా ఎన్నో లక్షల మంది డ్యాన్స్ చేయడానికి మీ స్వరమే కారణం. మీ మ్యూజిక్‌తో ఎంతో మందికి సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు. మీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి"
-అక్షయ్‌కుమార్, బాలీవుడ్ స్టార్ హీరో
"అద్భుతమైన సంగీత దర్శకుడు బప్పి లహిరి ఆకస్మిక మరణం బాధాకరం. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆయన పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. పాటల రూపంలో ఆయన ఎప్పటికీ అభిమానుల మదిలో నిలిచే ఉంటారు"