తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చికెన్​ కర్రీకి, చట్టానికి సంబంధం ఏంటి..? - legal thriller

అశుతోష్ రాణా, మార్కండ్ దేశ్​పాండే, నటాలియా జానోస్జేక్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'చికెన్ కర్రీ లా'. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. ఆగస్టు 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చికెన్ కర్రీ లా

By

Published : Jul 12, 2019, 7:47 PM IST

బాలీవుడ్ చిత్రం 'చికెన్ కర్రీ లా' ట్రైలర్ విడుదలైంది. అశుతోష్ రాణా, నటాలియా జానోస్జేక్, నివేదిత భట్టాచార్య, మార్కండ్ దేశ్​పాండే ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. లీగల్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓ విదేశీ యువతి మన దేశంలో అత్యాచారానికి గురై.. న్యాయం కోసం పోరాడుతూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది చిత్ర కథాంశం. "మన న్యాయ వ్యవస్థలో ఓ నిర్దోషిని దోషిగా నిరూపించడం చాలా సులభం సార్.. ఓ నిర్దోషిని నిర్దోషిగా రుజువు చేయడం అసాధ్యం" అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

నటాలియా అత్యాచారానికి గురైన విదేశీ యువతిగా నటించింది. అశుతోష్ రాణా న్యాయవాది పాత్ర పోషించాడు. శేఖర్ సిర్రిన్ దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: నాని 'గ్యాంగ్​లీడర్'​కు రేపే మ్యూజిక్ స్టార్ట్

ABOUT THE AUTHOR

...view details