విభిన్న చిత్రాల దర్శకుడు హన్సల్ మోహతా తీసిన సినిమా 'ఛాలంగ్'. స్పోర్ట్స్ కామెడీగా తెరకెక్కుతోంది. ఇందులో రాజ్‌కుమార్‌రావ్, నుస్రత్ బరుచా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. హరియాణాలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి నేపథ్యంగా కథ సాగుతుంది. రాజ్‌కుమార్‌రావ్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా కనిపించనున్నారు. బద్ధకస్తుడైన వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లలకు ఆసక్తికరంగా ఏయే విషయాలు నేర్పించాడన్నది ట్రైలర్‌లో చూపించారు.
ట్రైలర్: ఈ వ్యాయామ ఉపాధ్యాయుడికి చాలా బద్ధకం - రాజ్ కుమార్ రావ్ ఛాలంగ్ ట్రైలర్
రాజ్‌కుమార్ రావ్ 'ఛాలంగ్' ట్రైలర్ అలరిస్తోంది. నవంబరు 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా.
"మేం కామెడీతో పాటు ఒక చిన్న సందేశం ఇవ్వాలని దీనిని నిర్మించాం. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల జీవితాలకు ఈ చిత్రం దగ్గరగా ఉంటుంది. ఈ దీపావళికి తీసుకురాబోతున్నాం. కామెడీ, ఫ్రెండ్‌షిప్, యుద్ధం, లవ్‌తో పాటు అనేక ఎమోషన్స్ ఇందులో ఉంటాయి"అని దర్శకుడు హన్సల్ అన్నారు.
'నా పాఠశాల రోజులను హరియాణాలోనే గడిపాను. అందువల్ల ఇందులోని పాత్ర నాకు దగ్గరగా ఉంది. పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొదించడానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఛాలంగ్ చిత్రం నా పాఠశాల రోజులకు తీసుకువెళ్లింది' అని రాజ్‌కుమార్ రావ్ చెప్పారు. నవంబరు 13న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.