తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్ - bollywood news

హీరో షారుక్​తో 'చెన్నై ఎక్స్​ప్రెస్', 'దిల్​వాలే', 'హ్యాపీ న్యూయర్' వంటి సినిమాలు తీసిన నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తెకు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్​లో ఉంచారు.

ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్
షాజా మొరానీ

By

Published : Apr 6, 2020, 1:43 PM IST

కరోనా మహమ్మారి.. సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరినీ పట్టిపీడిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి ఈ వైరస్​ సోకడం తాజాగా కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం జరిపిన వైద్యపరీక్షల్లో ఆమెకు పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని కరీమ్ స్వయంగా వెల్లడించారు.

"షాజాకు కరోనా లక్షణాలు ఏం కనిపించలేదు కానీ పాజిటివ్​గా తేలింది. మరో కుమార్తె జోయాకు పరీక్షలు జరిపాం. అయితే ఆమెకు నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారిద్దరూ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో ఐసోలేషన్​లో ఉన్నారు. షాజా.. మార్చి తొలివారంలో శ్రీలంక నుంచి, జోయా.. మార్చి 15న రాజస్థాన్ నుంచి వచ్చారు" -కరీమ్ మొరానీ, బాలీవుడ్ నిర్మాత

కరీమ్.. బాలీవుడ్​ బాద్​షా షారుక్​కు ఆప్తుడు. అతడితో 'రావన్', 'చెన్నై ఎక్స్​ప్రెస్', 'హ్యాపీ న్యూయర్', 'దిల్​వాలే' సినిమాలను నిర్మించారు.

భారత్​లో ప్రస్తుతం 4067 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 109 మంది మృత్యువాతపడ్డారు.​

ABOUT THE AUTHOR

...view details