తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమాన తారల లుక్స్​ రీక్రియేట్​.. నెటిజన్లు ఫిదా

తమ అభిమాన హీరోయన్ల లుక్స్​ని రీక్రియేట్ చేసి అందరినీ ఆకట్టుకుంటోంది చెన్నైకి చెందిన మేకప్ ఆర్టిస్ట్ జుడిత్. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

makeup artist
అభిమాన తారలు

By

Published : Apr 21, 2021, 6:40 PM IST

తమ అభిమాన నటీనటులు నటించిన చిత్రాల్లోని కొన్ని ఫేమస్‌ లుక్స్‌ని రీక్రియేట్‌ చేసి అందర్నీ ఆకర్షించాలని కొంతమంది సినీ ప్రియులు అనుకుంటారు. అలాంటి అభిమానుల్ని ఇప్పటికే మనం ఎన్నో సందర్భాల్లో చూశాం. కాగా, తాజాగా చెన్నైకి చెందిన జుడిత్‌ అనే మేకప్‌ ఆర్టిస్ట్‌.. తనకు నచ్చిన హీరోయిన్ల‌ ఫేమస్‌ లుక్స్‌ని రీక్రియేట్‌ చేసింది.

అలా ఇప్పటివరకూ ఆమె సమంత, నయనతార, రష్మిక, అమలాపాల్‌, నజ్రియాలకు సంబంధించిన లుక్స్‌ని రీక్రియేట్‌ చేసి.. ఆ ఫొటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఆమె రీక్రియేట్‌ చేసిన లుక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..!

ఇదీ చదవండి :ఆ పాటకు మాధురి హావభావాలు అదుర్స్​!

ABOUT THE AUTHOR

...view details