తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లవ్​స్టోరి' దర్శకుడికి నాగచైతన్య కూల్​ గిఫ్ట్ - samantha akkineni

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా 'లవ్‌స్టోరి'. తాజాగా ఈ సినిమా నుంచి 'ఏయ్​ పిల్లా' అనే పాటను ప్రివ్యూ రూపంలో విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వీక్షకులను ఆకట్టుకోవడం వల్ల మంచి స్పందన లభించింది. ఇందుకుగానూ దర్శకుడు శేఖర్​ కమ్ములకు అదిరిపోయే గిఫ్ట్​ ఇచ్చాడు చై. తాజాగా వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడీ డైరెక్టర్​.

Chay Akkineni Gifted cool shades to sekharkammula on the sets of LoveStory
'లవ్​స్టోరి' దర్శకుడికి నాగచైతన్య కూల్​ గిఫ్ట్

By

Published : Feb 15, 2020, 11:33 AM IST

Updated : Mar 1, 2020, 9:51 AM IST

ప్రేమకథలను సహజంగా తెరకెక్కించడంలో దిట్ట 'శేఖర్‌ కమ్ముల'. అతడు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'లవ్​స్టోరి'. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి 'ఏయ్‌ పిల్లా' అనే పాట ప్రివ్యూ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. దీనికి అభిమానుల నుంచి ఊహించని స్పందన రావడం వల్ల డైరెక్టర్​కు కళ్లద్దాలు బహుమతిగా ఇచ్చాడు 'చై'. వీటిని తాజాగా ట్విట్టర్​ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు శేఖర్​ కమ్ముల. అంతేకాకుండా తర్వాత టీజర్​ కోసం మరో గిఫ్ట్​ సిద్ధం చేసుకో అంటూ ట్వీట్​ చేశాడు.

కళ్లజోడుతో శేఖర్​ కమ్ముల

సమంతకు బుర్ర గిర్రుమంది...!

తాజా వీడియో ప్రోమోలో నాగచైతన్య, సాయిపల్లవి ఆకట్టుకునేలా కనిపించారు. సినిమాలోని పలు సన్నివేశాలతో వీడియోను చిత్రీకరించారు. అయితే ప్రోమో చివర్లో చైతన్య మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ సాయిపల్లవి అతడ్ని ముద్దు పెట్టుకుంటుంది. దీనిపై ఆశ్చర్యానికి గురైన చై.. భావోద్వేగానికి లోనవుతాడు. వెంటనే సాయిపల్లవి.. "ఏంది, ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా" అని నవ్వుతూ అడుగుతుంది. అయితే ఆఖరి షాట్​పై నాగచైతన్య భార్య సమంత స్పందించింది.

సమంత

"ఏయ్‌ పిల్లా మ్యూజికల్‌ ప్రివ్యూ ఇప్పుడే చూశా. చాలా బ్రిలియంట్‌గా ఉంది. ఆ చివరి షాట్‌ చూశాక కొన్ని సెకన్ల పాటు నా బుర్ర ఆగిపోయినట్లయింది" అని మాట్లాడింది సామ్‌.

'ఫిదా' తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. శేఖర్‌ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ఇది కావడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. వేసవిలో కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Last Updated : Mar 1, 2020, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details