తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్ సేతుపతి-కత్రినా.. 'మెర్రీ క్రిస్మస్​' - కత్రినా కైఫ్ లేటేస్ట్ న్యూస్

విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న హిందీ సినిమాకు 'మెర్రీ క్రిస్మస్​' టైటిల్​ నిర్ణయించారు. దీని షూటింగ్​ జూన్​లో ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Vijay Sethupathi's Merry Christmas
విజయ్ సేతుపతి కత్రినా కైఫ్

By

Published : May 16, 2021, 5:38 AM IST

Updated : May 16, 2021, 6:42 AM IST

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్​ కలిసి నటిస్తున్న సినిమాకు టైటిల్​ పెట్టేశారు. 'మెర్రీ క్రిస్మస్​' పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని నిర్మాత రమేశ్ తౌరుని చెప్పారు.

ఏప్రిల్​లోనే మొదలవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్.. కత్రినాకు కరోనా రావడం వల్ల నిలిచిపోయింది. ఆ తర్వాత సెకండ్​ వేవ్ ప్రభావంతో షూటింగ్​లు ఆగిపోయాయి. అయితే జూన్​లో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు నిర్మాత రమేశ్​ తెలిపారు.

ఇదే కాకుండా విజయ్ సేతుపతి 'ముంబయికర్', 'గాంధీ టాక్స్', రాజ్​-డీకే దర్శకత్వంలో వెబ్​ సిరీస్​లో నటిస్తున్నారు. వీటి షూటింగ్​ కూడా కరోనా కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

Last Updated : May 16, 2021, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details