గోపీచంద్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'చాణక్య'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ డిలిటెడ్ సీన్ విడుదల చేసింది చిత్రబృందం. సుమారు 3 నిమిషాలు వ్యవధి ఉన్న ఈ వీడియో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది.
మంచి కామెడీ సీన్ కట్ చేసేశారే..! - గోపీచంద్, మెహరీన్ ప్రధాన పాత్రలు
గోపీచంద్ కథానాయకుడిగా నటించిన 'చాణక్య' చిత్రం ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ డిలిటెడ్ సీన్ విడుదల చేశారు. 3 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది.
ప్రముఖ హాస్యనటుడు సునీల్ ఈ సన్నివేశంలో ఉండటం వల్ల కామెడీ ఊపందుకుంది. వీడియోలో గోపీచంద్, సునీల్ కథానాయిక మెహరీన్‌ను ఏడిపించి మళ్లీ తన దగ్గరకే ఉద్యోగం కోసం వస్తారు. గతంలో జరిగింది మనసులో పెట్టుకుని కోపంతో వాళ్లిద్దర్ని బయటకు పంపించేస్తుంది హీరోయిన్.
"ఈ ఉద్యోగం కోసం ఎందుకిన్ని తిప్పలు.." అని గోపీచంద్ అనగా.. సునీల్ చెప్పే భారీ హాస్యభరిత డైలాగ్ అందర్ని అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.
ఇది చదవండి: ఎన్టీఆర్ సన్నగా మారాడు.. రాజమౌళికి వయసు పెరిగింది