తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాహో నిర్మాతలతో నాగచైతన్య సినిమా! - సాహో

యూవీ క్రియేషన్స్​ నిర్మాణంలో త్వరలో నాగచైతన్య సినిమా చేయనున్నాడని సమాచారం. ప్రస్తుతం వెంకీమామ, శేఖర్​ కమ్ములతో సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నాడీ హీరో.

సాహో నిర్మాతలతో నాగచైతన్య సినిమా..?

By

Published : Jul 17, 2019, 7:30 PM IST

టాలీవుడ్​లో యూవీ క్రియేషన్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం రూ.300 కోట్లతో 'సాహో'ను రూపొందిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నిర్మాతలు అక్కినేని నాగచైతన్యతో త్వరలో సినిమా చేయనున్నారని సమాచారం. 'వెంకటాద్రి ఎక్స్​ప్రెస్', 'ఎక్స్​ప్రెస్ రాజా'లతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం వెంకీమామ, శేఖర్ కమ్ముల చిత్రాలతో బిజీగా ఉన్నాడు అక్కినేని హీరో.

ఒకవేళ ఈ సినిమాలో చేసేందుకు చైతూ అంగీకరించకపోతే సాయిధరమ్ తేజ్​ను తీసుకోనున్నారని సమాచారం. త్వరలో ఈ విషయంపై స్పష్టత ఇవ్వనున్నారు నిర్మాతలు.

ఇది చదవండి: అందుకే శివ నిర్వాణ​తో సినిమా చేశానంటున్న హీరో నాగచైతన్య

ABOUT THE AUTHOR

...view details