తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చావు కబురు..' రిలీజ్​ డేట్​.. కిచ్చా సుదీప్​ @25 - నరుడి బ్రతుకు నటన

టాలీవుడ్​లో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'చావు కబురు చల్లగా' చిత్రం విడుదల తేదీ సహా 'రెడ్​' ఐటెంసాంగ్​ వీడియో అప్​డేట్స్​ వచ్చాయి.

chaavu kaburu challaga movie release date announced
'చావు కబురు..' రిలీజ్​ డేట్​.. కిచ్చా సుదీప్​ @25

By

Published : Jan 31, 2021, 7:23 PM IST

కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి జంటగా 'చావు కబురు చల్లగా' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. 'పూర్తి వినోదానికి సిద్ధం కండి' అంటూ ట్వీట్‌ చేసింది. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్‌బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.

'చావు కబురు చల్లగా' సినిమా రిలీజ్​ పోస్టర్​

కన్నడ అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్​ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చిత్రపరిశ్రమలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న కిచ్చా సుదీప్

యువ కథానాయకుడు రామ్ 'రెడ్'​ ద్విపాత్రాభియం చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంలోని డించక్​ పుల్​వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం.

సితార ఎంటర్​టైన్మెంట్స్​ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'నరుడి బ్రతుకు నటన'. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి ప్రధానపాత్రలో పోషిస్తున్నారు. ఆదివారం దీనికి సంబంధించిన పూజాకార్యక్రమం జరిగింది.

'నరుడి బ్రతుకు నటన' పూజా కార్యక్రమం

ఇదీ చూడండి:'గని' చిత్రంలో అతిథిగా ఉపేంద్ర

ABOUT THE AUTHOR

...view details