అన్లాక్ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా షూటింగ్లు జరుపుకోవచ్చని తెలిపింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
షూటింగ్లకు కేంద్రం అనుమతి.. కానీ ఇవి తప్పనిసరి
కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్లను తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం, మాస్కులు ధరించి షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలిపింది.
షూటింగ్లకు ఇవి తప్పనిసరి పాటించాల్సిందే!
కేంద్ర మార్గదర్శకాలు
- బహిరంగ ప్రదేశాల్లో యూనిట్ సిబ్బంది మొత్తం ఫేస్ మాస్క్లు తప్పనిసరిగా ఉపయోగించాలి.
- ఆరోగ్య సేతు యాప్ను నటీనటులంతా ఉపయోగించాలి.
- షూటింగ్ సమయాల్లో విజిటర్లను అనుమతించవద్దు.
- మేకప్ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
- సాధ్యమైనంత తక్కువ మంది సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చూడాలి.
- థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు చేయాలి.
- టికెట్లు ఆన్లైన్లో మాత్రమే విక్రయించాలి.
- షూటింగ్ పాయింట్ వద్ద సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలి.
- చిత్రీకరణ జరిపే ప్రాంతంలో తాత్కాలిక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.
- వయసు పైబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
- కామన్ లొకేషన్స్ అయిన సెట్స్, కాఫ్టేరియా, మేకప్ రూమ్స్, ఎడిట్ రూమ్స్, కేరవ్యాన్స్, వాష్రూమ్స్ తరచూ శానిటైజ్ చేయాలి.
- నటులు ఇంటివద్దే ప్రాక్టీస్ చేసేటట్లు చూసుకోవాలి
Last Updated : Aug 23, 2020, 2:41 PM IST