ఓటు వేసిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఓటు వేశారు. 'ప్రతి ఓటు లెక్కకొస్తుంది. నా ఓటు వేశా. మరి మీరు?' అంటూ ఓటు వేయాలని అందరినీ కోరారు.
16:58 December 01
ఓటు వేసిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఓటు వేశారు. 'ప్రతి ఓటు లెక్కకొస్తుంది. నా ఓటు వేశా. మరి మీరు?' అంటూ ఓటు వేయాలని అందరినీ కోరారు.
16:50 December 01
ఓటేసిన శిరీష్
అల్లు శిరీష్ కూడా తన ఓటు బాధ్యతను నిర్వర్తించారు. అనంతరం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
16:47 December 01
ఓటేసిన రాజశేఖర్
సీనియర్ నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు.
14:21 December 01
ఓటేసిన నైనా జైస్వాల్
ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
14:17 December 01
ఓటు వేసిన సాయి తేజ్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేలికున్న సిరా మార్కును చూపిస్తూ ఫొటోనూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
14:01 December 01
టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు సిరా చుక్క చూపిస్తూ దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.
13:21 December 01
హీరో రామ్ పోతినేని ఓటేశారు. ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
12:49 December 01
కోట శ్రీనివాస రావు ఓటు
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో ఓటు వేశారు.
12:48 December 01
ఓటేసిన అల్లుఅర్జున్ సతీమణి
అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
12:21 December 01
జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.72లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓటు వేశారు.
11:33 December 01
11:26 December 01
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఓటేసిన విజయ్ దేవరకొండ, కుటుంబసభ్యులు.
11:01 December 01
కేపీహెచ్‌బీ కాలనీలో ఓటేసిన సినీనటుడు రాజేంద్రప్రసాద్.
10:36 December 01
ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతిఒక్కరూ ఓటు వేయడం తమ బాధ్యతగా గుర్తించాలని అన్నారు.
10:31 December 01
10:10 December 01
ఓటేసిన సినీ నటుడు, నిర్మాత అశోక్ కుమార్.
10:09 December 01
గ్రేటర్ ఎన్నికల్లో సినీనటుడు నాగార్జున ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో సతీమణి అమలతో కలిసి ఆయన ఓటేశారు.
09:45 December 01
ప్రముఖ దర్శకుడు క్రిష్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు తాను సిరా గుర్తును చూపిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు.
09:18 December 01
తరలి రండి.. ఓటేయండి
జీహెంచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కృషి చేసింది. పౌరులు పెద్ద ఎత్తున బయటకొచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నటుడు నాగార్జున, విజయదేవరకొండ, శేఖర్ కమ్ముల, నటి ఝాన్సీ, యాంకర్ సుమ తదితరులు సినీ ప్రముఖులు కోరారు.
"భావి తరాల అభివృద్ధిని నిర్దేశించే ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకూడదు. సెలవు ఇచ్చారని ఇంట్లో కూర్చోకుండా తప్పకుండా ఓటేయాలి. ఏమీ ఆశించకుండా ఓటేసినప్పుడే అభివృద్ధిపై నాయకులను ప్రశ్నించే వీలు కలుగుతుంది."
-అలీ, హాస్యనటుడు
08:17 December 01
06:44 December 01
సెలబ్రిటీ ఓటింగ్
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 150 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, భాజపా 149, కాంగ్రెస్ 146, తెదేపా 106, ఎంఐఎం 41, సీపీఎం 12 ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది బల్దియా బరిలో ఉన్నారు. 9,101 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.