ప్రస్తుతం రామ్ చరణ్ లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఆ మధ్య తన అమ్మ, నానమ్మతో కలిసి వెన్నను తీయడం నేర్చుకున్నారు. ఆ వీడియోను తన ట్విట్టర్లో కూడా పోస్టు చేశారు. అయితే ఆ వీడియోకు చిరంజీవి స్పందిస్తూ.. "మా అమ్మ దగ్గర నీ పప్పులు ఉడకవు" అంటూ కౌంటర్ ఇచ్చారు.
సెట్స్‌కి వెళ్లకుండా ఉండలేము: చరణ్ - సెట్స్ పైకి వెళ్లకుండా ఉండలేము: చరణ్
లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్నారు సినీతారలు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా కుటుంబంతో గడుపుతున్నారు. తాజాగా ఓ పోస్టును ట్విట్టర్లో షేర్ చేశారు.
తాజాగా చరణ్ 'ధ్రువ' చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను తన ట్విట్టర్లో పంచుకున్నారు. "ఇవి 'ధ్రువ' సినిమా షూటింగ్ నాటివి. తిరిగి సెట్స్ పైకి వెళ్లకుండా ఉండలేము. అప్పటి వరకు ఇంట్లోనే ఉండండి.. క్షేమంగా" అంటూ రాసుకొచ్చారు.
2016లో విడుదలైన 'ధ్రువ' చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించగా, అరవింద స్వామి ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం చెర్రీ.. రాజమౌళి దర్శకత్వంలో 'రౌద్రం రణం రుధిరం' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు.