దేశం, భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరిస్తున్న 'బుట్టబొమ్మ' పాట.. మరో అద్భుత ఘనతను సొంతం చేసుకుంది. 100 గ్లోబల్ వీడియోల జాబితాలో చోటు దక్కించుకుని రికార్డు సృష్టించింది. 'అల వైకుంఠపురములో'ని ఈ గీతం 15వ స్థానంలో నిలవగా, ఇదే సినిమాలోని 'రాములో రాములా' 49వ ప్లేస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
'బుట్టబొమ్మ' పాట అంతర్జాతీయ రికార్డు - బుట్టబొమ్మ రికార్డులు
100 గ్లోబల్ వీడియోల్లో 'అల వైకుంఠపురములో' సినిమాకు చెందిన 'బుట్టబొమ్మ', 'రాములో రాములా' పాటలు చోటు దక్కించుకుని రికార్డు సృష్టించాయి.
అల్లు అర్జున్ పూజా హెగ్డే
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నర్తించిన ఈ పాటలోని స్టెప్పులకు ఎందరో సెలబ్రిటీలు ఫిదా అయిపోయారు. వారిలో క్రికెటర్ వార్నర్, నటీమణులు శిల్పాశెట్టి, సిమ్రాన్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ గీతం యూట్యూబ్‌లో 200 మిలియన్ల వ్యూస్‌కు చేరువలో ఉంది.
బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా 'అల వైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. కలెక్షన్ల పరంగా నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది.