అల్లు అర్జున్ - సుకుమార్ చిత్రమంటేనే అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య-2 మంచి విజయాలు సాధించాయి. తాజాగా రాబోతున్న మూడో సినిమాకు భారీ ప్లాన్లు వేస్తున్నాడట సుకుమార్. కేరళలోని దట్టమైన అడవుల్లో ఉన్న జలపాతం దగ్గర బన్ని పరిచయ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నాడట.
బాహుబలిలో ప్రభాస్ పరిచయ సన్నివేశం కూడా కంటికి కనిపించనంత ఎత్తైన జలపాతం దగ్గరే జరిగింది. మరి అల్లు అర్జున్ సీన్ అంతకు మించి ఉండేలా సుకుమార్ జాగ్రత్త పడుతున్నాడని సమాచారం. ఈ సన్నివేశానికి సంబంధించి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేశాడని తెలుస్తోంది. అయితే ఇందులో బన్నీ పాల్గొనలేదట.