తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బ్రహ్మాస్త్ర' విడుదల తేదీ మారింది..! - రణ్​బీర్ కపూర్

భారీ బడ్జెట్​తో రూపొందుతున్న బాలీవుడ్​ చిత్రం 'బ్రహ్మాస్త్ర' విడుదల ఆలస్యం కానుంది. ముందుగా అనుకున్నట్లు డిసెంబరులో కాకుండా వచ్చే ఏడాది వేసవిలో రానుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించాడు.

'బ్రహ్మాస్త్ర' వచ్చే తేదీ మారింది..!

By

Published : Apr 27, 2019, 5:58 PM IST

బాలీవుడ్​లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అగ్రనటులు అమితాబ్ బచ్చన్, రణ్​బీర్ కపూర్, ఆలియా భట్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబరులో విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు అయాన్ ముఖర్జీ తెలిపాడు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించాడు.

"ఇటీవలే సినిమాకు పనిచేస్తున్న అన్ని విభాగాల వారితో చర్చించాం. వీఎఫ్​ఎక్స్ కోసం మరింత సమయం కావాలని అడిగారు. ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాం. ఇవన్నీ సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. విడుదల ఆలస్యమైనా ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాన్ని రూపొందిస్తామనే నమ్మకం ఉంది" - అయాన్ ముఖర్జీ, దర్శకుడు

సామాజిక మాధ్యమాల్లో దర్శకుడు పంచుకున్న లేఖ

కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే విడుదలయిన లోగో టీజర్ చిత్రంపై ఆసక్తిని పెంచింది.

ABOUT THE AUTHOR

...view details